`పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` టీజ‌ర్ విడుద‌ల‌

Saturday,September 23,2017 - 12:28 by Z_CLU

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా.. చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ `126.18 ఎం`. జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

ఈ సంర‌ద్భంగా…
డా.రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “ఈ సినిమా టీజ‌ర్‌ను నా పిల్ల‌ల‌తో వారి స్నేహితుడు ఒక‌రు చూసి. ఈ సినిమా టీజ‌ర్ మాట్లాడుతుంది. మీ నాన్న‌గారేం మాట్లాడ‌న‌వ‌స‌రం లేదు. నేను చాలా ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేసిన త‌ర్వాత విల‌న్‌గా, క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చేయ‌మ‌ని అడిగారు. నేను కూడా స‌రేనని అనుకున్నాను. ఆ స‌మ‌యంలో నేను 30-40 క‌థ‌ల‌ను విన్నాను. ఒక్క‌టీ న‌చ్చ‌లేదు. అలాంటి స‌మ‌యంలో ప్ర‌వీణ్ స‌త్తారు ఈ క‌థ‌తో నా వద్ద‌కు వ‌చ్చారు. నేను పీక్స్‌లో ఉన్న‌ప్పుడు ఇలాంటిక‌థతో సినిమా చేయాల‌ని అనుకున్నాను. భారీ బడ్జెట్‌తో, హ‌లీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు ఎవ‌రూ ధైర్యం చేయ‌లేక‌పోయారు. నేను ఫెయిల్యూర్స్‌లో ఉండ‌గా ప్ర‌వీణ్ నేను చేయాల‌నుకున్న క‌థ‌తో వ‌చ్చాడు. మ‌రి ఇత‌ను హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా అని కూడా అనుకున్నాను. సినిమాను ముందు ఐదారు కోట్ల‌లోనే పూర్తి చేయాల‌నుకున్నాం కానీ చివ‌ర‌కు పాతిక కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ అయ్యింది. ఇది మా ఇంటిలో పెళ్లిలాంటి సినిమా. పెళ్లికి అందరినీ పిలిచిన‌ట్లు ఈ సినిమాకు అంద‌రినీ పిలిచి చూపిస్తాను“ అన్నారు.