'స్పైడర్' ప్రీమియర్ కి భారీ ఏర్పాట్లు

Saturday,September 23,2017 - 10:06 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘స్పైడర్’ రిలీజ్ కి రెడీ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షోలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.

ఇంటెలిజెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను అమెరికాలో 300 లకు పైగా లొకేషన్స్ లో పైగా ప్రీమియర్స్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా పై ఏర్పడిన భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఓ రేంజ్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తుంది యూనిట్. ఈ లెక్కన ప్రీమియర్స్ తో స్పైడర్ భారీ కలెక్షన్స్ కి శ్రీకారం చుట్టబోతున్నమాట.

మహేష్ సరసన రకుల్ ప్రీత్ జంటగా 120 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమా విడుదలకు ముందే దాదాపు 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఒక్క అమెరికాలోనే 600కు పైగా లొకేషన్లలో స్పైడర్ సినిమా విడుదలకానుంది.