30 కోట్ల గ‌రుడవేగ 

Tuesday,November 21,2017 - 01:05 by Z_CLU

జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ బ్యాన‌ర్‌పై డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా  నటించిన చిత్రం `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ న‌వంబ‌ర్ 3న విడుద‌లైంది. తొలి ఆట నుండే సూప‌ర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 5 రోజుల్లో 15 కోట్లు, 10 రోజుల్లో 22 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ చిత్రం 17 రోజుల్లో 30 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిపోయింది.

విడుద‌లై మూడు వారాలైన ఓవ‌ర్ సీస్ స‌హా విడుద‌లైన ప్ర‌తిచోట సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారంద‌రూ రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, కిషోర్‌, అదిత్ అరుణ్‌, శ్ర‌ద్ధాదాస్‌, స‌న్నిలియోన్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల త‌దిత‌రులు న‌ట‌న‌ను అప్రిసియేట్ చేస్తున్నారు. త‌న ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామెన్స్‌తో రాజ‌శేఖ‌ర్ క‌మ్‌బ్యాక్ అయ్యార‌ని ప్ర‌శంసిస్తున్నారు.