నాని సినిమా ఫస్ట్ లుక్ అదిరింది

Thursday,February 23,2017 - 04:36 by Z_CLU

నాని, నివేద థామస్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజయింది. ‘నిన్ను కోరి’ అని టైటిల్ ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, సినిమా గురించి పెద్దగా చెప్పకపోయినా, ఆ ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని బట్టి మెలోడియస్ లవ్ స్టోరీ అని ఈజీగా గెస్ చేసేయొచ్చు.

శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని D.V.దానయ్య నిర్మిస్తున్నాడు.  స్టోరీ డిమాండ్ ని బట్టి 90% షూటింగ్ U.S. లోనే అని, ఆల్ రెడీ కన్ఫం చేసేసిన సినిమా యూనిట్, ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది.

నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ నేను లోకల్ ఫీవర్ కూడా తగ్గక ముందే సెట్స్ పైకి రావడంతో న్యాచురల్ గానే సినిమాపై బోలెడంత క్యూరాసిటీ తో పాటు, కాన్సంట్రేషన్ క్రియేట్ అయింది. ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్న  సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.