రిపీట్ కానున్న సక్సెస్ ఫుల్ కాంబో

Thursday,February 23,2017 - 05:40 by Z_CLU

న్యూస్ లో న్యాచురల్ స్టార్ నాని ఉంటున్నాడా లేక నాని బ్యాగ్ లో వేసుకుంటున్న సినిమాల సక్సెస్ ఉంటుందా, అంటే రెండింటికీ ఓటు పడుతుంది. నాని ఓ సినిమాకి సంతకం చేశాడంటే ‘100% ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ’ కార్డు స్టాంప్ అయిపోతుంది. ప్రస్తుతం నివేద థామస్ తో U.S. లో రొమాంటిక్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న నాని సక్సెస్ అకౌంట్ లో స్పేస్ కోసం మరో సినిమా ఆల్ రెడీ టోకెన్ తీసేసుకుంది.

క్రిష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో నానితో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి, తన నెక్స్ట్ సినిమాని మళ్ళీ నానితోనే ఫిక్స్ చేసుకున్నాడు. ఓ సారి అవుట్ స్టాండింగ్ లవ్ స్టోరీతో నానిని డిఫెరెంట్ ప్రెజెంట్ చేసిన హను రాఘవపూడి ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడో తెలీదు కానీ మొత్తానికి ఈ సినిమా మాత్రం ఈ రోజే అఫీషియల్ గా అనౌన్స్ అయింది.

మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ సినిమాని శ్రీనివాస ప్రసాద్, సుధాకర్ కలిసి నిర్మించనున్నారు. ఆగష్టు కల్లా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ప్రస్తుతానికి హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది.