పూరి రోగ్ రిలీజయ్యాడు

Thursday,February 23,2017 - 04:02 by Z_CLU

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిన్న ఇషాన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ‘రోగ్’ టీజర్ రిలీజ్ చేశాడు. బెసిగ్గానే యూత్ పల్స్ తెలిసిన ఫిలిం మేకర్ కాబట్టి ఆ టీజర్ గురించి, సోషల్ మీడియాలో దానికి వస్తున్న రెస్పాన్స్ గురించి పెద్దగా డిస్కషన్స్ పెట్టకపోయినా, ఆల్ రెడీ ట్రెండింగ్ క్యాటగిరీలో రిజిస్టర్ అయిపోయింది. ఇకపోతే టీజర్ తరవాత ఇషాన్ ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇపుడు ఇది కూడా హాట్టెస్ట్ టాపికే.

C.R. మనోహర్, C.R. గోపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతుంది. మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్ గా నటిస్తున్న ఏ సినిమాని తలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు సినిమా యూనిట్.

సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న పూరి జగన్నాథ్, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. టీజర్ లో ఇషాన్ ఈజ్ చూస్తుంటే కాస్త పర్ ఫెక్ట్ ప్లానింగ్ లో ఉండాలి కానీ, టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనే అనిపిస్తుంది.