ఫిబ్రవరి హంగామా

Wednesday,February 01,2017 - 07:43 by Z_CLU

ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడా హంగామాను ఈ నెలలో కూడా కొనసాగించేందుకు రెడీ అవుతున్నారు కొందరు హీరోలు. నాగార్జున, నాని, రాజ్ తరుణ్, సూర్య లాంటి హీరోలు ఫిబ్రవరిని మరింత కలర్ ఫుల్ గా మార్చేందుకు రెడీ అవుతున్నారు.

feb-release_1

నేచురల్ స్టార్ నాని హంగామాతో ఫిబ్రవరి స్టార్ట్ కాబోతోంది. నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరిగింది. దేవిశ్రీ కంపోజ్ చేసిన ట్యూన్స్ హిట్ అవ్వడం, నాని-కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోవడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి.

feb-release_2

నాని సినిమాతో పాటు కనుపాప అనే మరో సినిమా కూడాా థియేటర్లలోకి వస్తోంది. రీసెంట్ గా జనతా గ్యారేజ్, మన్యం పులి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మోహన్ లాల్.. ఈసారి కనుపాప అనే డిఫరెంట్ మూవీతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. శుక్రవారం రోజు నాని సినిమాతో పాటు ఇది కూడా రిలీజ్ అవుతోంది.

feb-release_6

పవర్ ఫుల్ పోలీస్ గా ఇప్పటికే టోటల్ సౌత్ ను ఎట్రాక్ట్ చేసిన సూర్య… ఈనెల 9 నుంచి మరోసారి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ సినిమా.. ఈసారి కచ్చితంగా థియేటర్లలోకి రావడం ఖాయం అంటున్నాడు సూర్య. అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాాద్ సంగీతం అందించాడు. ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడం, గత సినిమాలు యముడు, యముడు-2 హిట్ అవ్వడంతో.. సింగం-3పై అంచనాలు పెరిగాయి.

feb-release_3

ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి కింగ్ నాగార్జున హంగామా షురూ కానుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన ఓం నమో వేంకటేశాయ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. గతేడాది వరుస విజయాలు అందుకున్న నాగ్… ఈ భక్తిరస చిత్రంతో ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నాడు. సినిమా కచ్చితంగా హిట్ అనే బజ్ ఇప్పటికే స్టార్ట్ అయింది.

feb-release_9

నాగ్ నటించిన ఓం నమో వేంకటేశాయ చిత్రంతో పాటు అంజలి లీడ్ రోల్ చేసిన చిత్రాంగద సినిమా కూడా ఫిబ్రవరి 10నే థియేటర్లలోకి రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉంది అంజలి. అంజలి ఈ సినిమాలో చిన్న మేకోవర్ ట్రై చేయడంతో పాటు… మూవీలో ఓ పాట కూడా పాడడం విశేషం.

feb-release_4

ఇప్పటివరకు సినిమాల లైనప్ బాగానే ఉంది. కానీ అసలైన పోటీ మాత్రం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతుంది. అవును.. ఆరోజున ఏకంగా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో కిట్టు ఉన్నాడు జాగ్రత్త. రాజ్ తరుణ్, అను ఎమ్మాన్యువేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. రాజ్ తరుణ్ సినిమాలు పైసా వసూల్ అనే బ్రాండింగ్ తెచ్చుకోవడంతో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాపై ఫోకస్ పెరిగింది. ఈ సినిమాలో కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించే కుర్రాడిగా రాజ్ తరుణ్ కనిపించబోతున్నాడు.

feb-release_7

ఫిబ్రవరి 17న థియేటర్లలోకి వస్తున్న మరో మూవీ గుంటూరోడు. మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఎస్.కే.సత్య దర్శకుడు. శ్రీవసంత్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఈమధ్యే విడుదలయ్యాయి. టైటిల్ క్యాచీగా ఉండడంతో పాటు ట్రయిలర్ కూడా బాగుండడంతో గుంటూరోడుపై అందరికీ ఆసక్తి పెరిగింది.

feb-release_5

రాజ్ తరుణ్, మంచు మనోజ్ సినిమాలతో పాటు… రానా కూడా అదే రోజు థియేటర్లలోకి రావాలని ఫిక్స్ అయ్యాడు. రానా హీరోగా ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఘాజీ సినిమాను ఫిబ్రవరి 17న ఒకేసారి తెలుగు-తమిళ-హిందీ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాడు నిర్మాత పీవీపీ. రానా నేవీ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా కథ అంతా దాదాపు సముద్ర గర్భంలోనే జరుగుతుంది. ఓ సబ్ మెరీన్ లో జరిగిన ఘటన ఆధారంగా ఘాజీ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది.

feb-release_10

ఫిబ్రవరి 17న రిలీజ్ కు రెడీ అయిన మరో మూవీ కేశవ. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో కెరీర్ లోనే గ్రాండ్ హిట్ అందుకున్న నిఖిల్ ఈసారి కేశవగా ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. గతంలో నిఖిల్-సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన స్వామి రారా సూపర్ హిట్ అవ్వడంతో.. కేశవ ప్రాజెక్టుపై హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా 17న వస్తుందా రాదా అనే డౌట్ కూడా ఉంది.

feb-release_8

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ ఫిబ్రవరికి పేకప్ చెప్పడానికి రెడీ అవుతున్నాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ. ఒక్కో సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్న ఈ మెగా హీరో… ఫిబ్రవరి 24న విన్నర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. సినిమాలో ఓ సింగిల్ ను మహేష్ బాబు రిలీజ్ చేయడంతో.. విన్నర్ సినిమాపై ఫోకస్ డబుల్ అయింది.