ట్విట్టర్ లోకి కొత్త తారలు

Wednesday,February 01,2017 - 08:07 by Z_CLU

ట్విట్టర్ లో రోజు రోజుకి సందడి పెరిగిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఒక్క ట్వీట్ తో తన సినిమా అప్ డేట్స్ గురించి, పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో అప్ టు డేట్ గా ఉంటున్నారు స్టార్స్. ఫ్యాన్స్ కి స్టార్స్ కి మధ్య బ్యారియర్స్ ని డిలీట్ చేస్తున్న ట్విట్టర్ వరల్డ్ లోకి మరో ఇద్దరు స్టార్స్ ఎంట్రీ ఇచ్చేశారు.

raviteja-zee-cinemalu

 సోషల్ మీడియా కింగ్ డం లోకి మాస్ మహారాజ్ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. తన బర్త్ డే రోజు ఒకేసారి రెండేసి సినిమాలను అనౌన్స్ చేసిన రవితేజ, ఇప్పుడు ఈ ట్విట్టర్ అకౌంట్ తో ఫ్యాన్స్ కి సర్ ప్రైజింగ్ కిక్ ఇచ్చాడు.

 nagababu

జనవరి 30 న ఫస్ట్ వీడియో ట్వీట్ చేసిన నాగబాబు, ఇకపై మెగా ఈవెంట్స్ దగ్గర నుండి ప్రతీది తన ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా షేర్ చేసుకోబోతున్నాడు. ఈ మెగా బ్రదర్ ఇలా ట్వీటెంట్రీ ఇలా ఇచ్చాడో లేదో, అలా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు.