Adipurush - అప్డేట్ కోసం వెయిటింగ్!

Thursday,September 24,2020 - 02:54 by Z_CLU

ఇటివలే ఎనౌన్స్ అయిన Prabhas ప్యాన్ ఇండియా మూవీ ‘Adipurush’నుండి రాబోయే ఎనౌన్స్ మెంట్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. Prabhas21 లో దీపిక ఫిక్స్ కాబట్టి ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా Prabhas22 లో హీరోయిన్ మీదే ఉంది. సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కనిపించే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ప్రస్తుతం దర్శకుడు Om Raut తో పాటు నిర్మాతలు కూడా ప్రభాస్ కి పర్ఫెక్ట్ అనిపించే హీరోయిన్ కోసం చూస్తున్నారు. పైగా సీత పాత్ర కావడంతో ఎక్కడా ఎలాంటి విమర్శ రాకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నటి ని తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే హీరోయిన్ ఫైనల్ చేయడానికి టైం తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఓ లిస్టు ప్రిపేర్ చేసిన మేకర్స్ అందులో నుండి ఓ హీరోయిన్ ను పిక్ చేసి ఎనౌన్స్ చేయబోతున్నారు. త్వరలోనే మేకర్స్ ఎనౌన్స్ చేయనున్న ఆ హీరోయిన్ ఎవరనేది తెలియనుంది. అప్పటి వరకు ప్రభాస్ సరసన ఆ హీరోయిన్, ఈ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంటుంది.