ఫ్యాన్స్ వెయిటింగ్ ప్రభాస్

Friday,May 15,2020 - 02:00 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో నుండి ఒక్కొక్కరు బయట పడుతున్నారు. మొన్నటి వరకు ప్రభాస్ తర్వాత ఆ లిస్టులో అందరి చూపు రానా పైనే ఉండేది. ప్రతీ ఈవెంట్ లో రానా పెళ్లి టాపిక్ అయ్యేది. అయితే ఇటివలే మిహిక ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు రానా. తన ప్రేమ సంగతి ఎక్కడా బయటికి రాకుండా చిన్న హింట్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే అందరు సప్రయిజ్ అయ్యారు.

ఇక రానా ఇలా తన ప్రేమ సంగతి చెప్పి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై అన్నాడో లేదో వెంటనే ఫ్యాన్స్.. ప్రభాస్ మీద ఫోకస్ పెట్టారు. ఎప్పట్నుండో కళ్ళు కాయలు కాచేలా తమ అభిమాన హీరో పెళ్లి గురించి ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నీ పెళ్ళెప్పుడు ప్రభాస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులేశారు.

నిజానికి ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పటి నుండో మీడియాలో నలుగుతుంది.  కానీ ఏది తేలడం లేదు. పెదనాన్న కృష్ణంరాజు కూడా అదే పనిలో ఉన్నప్పటికి ప్రభాస్ గ్రీన సిగ్నల్ ఇవ్వడం లేదు. మరి రానా ను చూసి అయినా ప్రభాస్ పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.