నితిన్ సంగతేంటి?

Friday,May 15,2020 - 01:13 by Z_CLU

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ అమలు చేయకముందే కొందరు హీరోలు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. లాక్ డౌన్ తర్వాత ప్లాన్ మార్చుకొని వెయిట్ చేశారు. కొన్ని రోజులుగా ఎదురుచూస్తూ పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్న నిఖిల్ ఇక లాభం లేదని ఎట్టకేలకు కొంత మంది బంధువులు, సన్నిహితుల మధ్య పల్లవి వర్మను వివాహం చేసుకున్నాడు.

నిఖిల్ తర్వాత తన పెళ్లి విషయం బయటపెట్టిన హీరో నితిన్. ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి పనులు కూడా మొదలెట్టి వాయిదా వేసుకున్నాడు నితిన్. దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ ప్రస్తుతం పరిస్థుతుల దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నాడు.

ఇక నిఖిల్ పెళ్లి అవ్వడంతో ఇప్పుడు నితిన్ ఫ్యాన్స్ తమ హీరో పెళ్లెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. తన వివాహానికి అందరు రావాలని భావిస్తున్నాడట నితిన్. ముఖ్యంగా పవర్ స్టార్ ఆశీస్సులు అందుకోవాలని చూస్తున్నాడట. ఈ లాక్ డౌన్ సమయంలో అది వీలు పడదు కనుక కొన్ని రోజులు వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.