ప్రభాస్ పెళ్లి పై క్లారిటి ....

Saturday,January 21,2017 - 11:38 by Z_CLU

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరా? అంటే టక్కున వినిపించే పేర్లలో ప్రభాస్ పేరు ముందుంటుంది. ఈశ్వర్ తో కెరీర్ స్టార్ట్ చేసి పరిశ్రమలో 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రభాస్ ఎప్పుడెప్పుడు తన పెళ్లి వార్త చెప్తాడా? అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి శుభవార్త చెప్పాడు రెబెల్ స్టార్ కృష్ణం రాజు.

ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా ద్వారా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావడంతో ‘అన్ని కుదిరితే ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుందని అమ్మాయి ఎవరు? పెళ్లి డేట్ ఎప్పుడు ? ఇవన్నీ ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత తెలియజేస్తామని. ప్రభాస్ కి ఎప్పుడు ఏం చెయ్యాలో అన్ని తెలుసని తన కెరీర్ విషయం లో తనకి మంచి ఆలోచన ఉందంటూ ప్రభాస్ పెళ్లి పై చక్కర్లు కొడుతున్న పుకార్ల కు పిలిస్టాప్ పెట్టేసాడు కృష్ణం రాజు.

మరి ప్రభాస్ ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత  ముందుగా పెళ్లి పీటలెక్కుతాడా? లేదా తన నెక్స్ట్ సినిమా ను సెట్స్ పైకి తీసుకొస్తాడా?   తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే …