హాట్ టాపిక్: పవన్ సినిమా టైటిల్ ఇదేనా!

Saturday,July 11,2020 - 02:27 by Z_CLU

సోషల్ మీడియాలో ఈమధ్య ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. మినిమం గ్యాప్ లో సినిమా టైటిల్ చెప్పకపోతే అభిమానులే సినిమాకు టైటిల్ పెట్టేస్తున్నారు. మొన్న రాధేశ్యామ్. ఇప్పుడు బందిపోటు.

ప్రభాస్ సినిమాకు రాధేశ్యామ్ అనే టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించకముందే ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. దీంతో మరో టైటిల్ గురించి మేకర్స్ ఆలోచించే పరిస్థితి రాలేదు. తప్పనిసరిగా రాధేశ్యామ్ ను ఫిక్స్ చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు పవన్-క్రిష్ సినిమాకు అదే రిపీట్ అయ్యేలా ఉంది.

ఈ సినిమాకు విరూపాక్షి అనే టైటిల్ ముందుగా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆ టైటిల్ పై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పెద్దగా రాలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. బందిపోటు అనే టైటిల్ ను ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు.

అటు క్రిష్ కూడా విరూపాక్షి అనే టైటిల్ కాకుండా మంచి క్యాచీ-మాస్సీ టైటిల్ కోసం చూస్తున్నాడు. చూస్తుంటే.. అభిమానులు ట్రెండ్ చేస్తున్న బందిపోటు టైటిల్ నే పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో.