సంక్రాంతి సెంటిమెంట్ తో సీనియర్ హీరో?

Saturday,July 11,2020 - 01:19 by Z_CLU

 

అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి కి జనవరి 8న ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీ స్టారర్ ‘RRR’ థియేటర్స్ లోకి వచ్చేది. కానీ కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడింది. దీంతో రాజమౌళి ఆ డేట్ ను రీచ్ అవ్వలేడని తెలుస్తుంది. ఇక ఆ డేట్ పై ఇప్పుడు కొందరు సీనియర్ హీరోలు కన్నేశారు.

అవును.. వెంకటేష్ నారప్పను సంక్రాంతి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వెంకటేష్ కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. గతంలో వెంకీ నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. అందుకే నారప్ప ను సంక్రాంతి కి ప్లాన్ చేస్తున్నారు.

తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అసురన్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరికొన్ని రోజులు మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉంది. మిగిలిన పార్ట్ ను ఎక్కువ మందితో షూట్ చేయాల్సి ఉండటంతో ఇంకా టైం తీసుకుంటున్నారు మేకర్స్.
ఇంకో రెండు మూడు నెలల్లో పరిస్థితులు చక్కబడిన వెంటనే బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసే సంక్రాంతి ప్రేక్షకుల

ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కలైపులి ఎస్. థాను తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నారు.