మెగాస్టార్ లిస్టులో మరో యంగ్ డైరెక్టర్

Saturday,July 11,2020 - 02:39 by Z_CLU

కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరు నెక్స్ట్ వరుస సినిమాలు లైనప్ లో పెట్టారు.  ఇప్పటికే చిరు నెక్స్ట్ లిస్టులో సుజీత్, బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో పాటు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. వీరితో పాటు మరికొందరు కథలు వినిపించి ఆయన నుండి కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అలా చిరు కాల్ కోసం వెయిట్ చేసే లిస్టులో తాజాగా చేరాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ!’ తో దర్శకుడిగా అభినందనలు అందుకున్న ప్రశాంత్ ఇటివలే రాజశేఖర్ తో ‘కల్కి’ సినిమా చేశాడు. సైరా కంటే ముందే చిరు కి ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ చెప్పాడట ప్రశాంత్.

ఇక చిరు కి కూడా కథ నచ్చిందని ఆయన నుండి ఫైనల్ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నాడు ప్రశాంత్. ప్రస్తుతం ఈ దర్శకుడు కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ప్రయోగాత్మక చిత్రం రూపొందిస్తున్నాడు. మరి చిరు నుండి ఈ యంగ్ డైరెక్టర్ కి ఫోన్ వచ్చేదెప్పుడో..?