మరో సినిమాపై ‘F2’ ఎఫెక్ట్

Saturday,April 27,2019 - 02:47 by Z_CLU

‘F 2’ క్రియేట్ చేసిన వైబ్స్ ఇప్పట్లో తగ్గేలా లేవు. మరీ ముఖ్యంగా వెంకటేష్, వరుణ్ తేజ్ ల కెమిస్ట్రీకి ఆడియెన్స్ లో ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. అందుకే ఇంకో సినిమాకి పని చేసింది ఈ ఫన్ ఫిల్డ్ జోడీ. అలాద్దీన్ సినిమాకి వీళ్లిద్దరి డబ్బింగ్ చెప్పారు. దాంతో ఈ సినిమా మరింత ఫోకస్ లోకి వచ్ఛేసింది .

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వఛ్చిన ‘F2’ సీక్వెల్ కి ఆడియెన్స్ లో ఇప్పటికే బోలెడంత డిమాండ్ ఉంది. ఇప్పటికే మేకర్స్ దీనికి సంబంధించి ప్రిపరేషన్స్ బిగిన్ చేసినా, ప్రాక్టికల్ మరింత టైమ్ పట్టనుంది. అయితే ఈ లోపు అవకాశం వఛ్చినప్పుడల్లా తమ కామిక్ టైమింగ్ తో ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నారు వెంకీ, వరుణ్ తేజ్.

వెంకీ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయినా ఈ సినిమా టీజర్ లో హీరో రోల్ కి వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పాడు. చూస్తుంటే వెంకీ వాయిస్ సినిమాలో మరిన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ లో వినిపించే అవకాశాలే కనిపిస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మే 24 న రిలీజ్ అవుతుండి. వెంకీ, వరుణ్ తేజ్ ల వాయిస్ తో నేటివిటీకి దగ్గరైన ఈ సినిమా ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేయనుందో చూడాలి.