శృతి హాసన్ తెలుగు రీఎంట్రీ ఎప్పుడు?

Saturday,April 27,2019 - 03:08 by Z_CLU

2017 లో కాటమరాయుడు లో నటించి మళ్ళీ కనిపించలేదు శృతి హాసన్. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కనిపించే ఛాన్స్ ఉంది. ఎఁదుకంటే తమిళ్ లో ఓ సినిమా ఒప్పుకుంది. విజయ్ సేతుపతి హీరోగా మొన్ననే లాంఛ్ అయింది, అది సెట్స్ పైకి కూడా వచ్చేసింది. సో.. ఇదే ఊపులో తెలుగులో కూడా ఆమె కమిట్ అయ్యే చాన్స్ కనిపిస్తుంది.

రెండేళ్ళ గ్యాప్ వఛ్చినట్టు అనిపిస్తున్నా నిజానికి శృతి హాసన్ బిజీగానే ఉంది. ఈ రెండేళ్లలో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా చోట్ల మ్యూజిక్ షోల్లో పాల్గొంటూ యాక్టింగ్ కి ఇన్నాళ్లు చిన్న బ్రేక్ ఇచ్చింది.

అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా అయ్యే ఆలోచనల్లో ఉంది. ఇప్పటికే 2 హిందీ సినిమాలకు సంతకం చేసింది. ఇప్పుడు శృతి ద్రుష్టి తెలుగు సినిమాపై ఉంది. ఈ అయితే శృతి రీ ఎంట్రీ ఏ హీరోతో జరగనుంది..?

మ్యాగ్జిమమ్ చిరంజీవి-కొరటాల సినిమా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గతంలోనూ కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు లో నటించింది. కాబట్టి ఈ సినిమాలో కన్సిడర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.