జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ

Tuesday,July 24,2018 - 05:30 by Z_CLU

విజయ దేవరకొండలో ఇప్పటికే ఎన్నో యాంగిల్స్ చూసేశాం. అర్జున్ రెడ్డిలో రెబల్ ప్రేమికుడిగా మాత్రమే కాకుండా, రీసెంట్ గా అతడిలో ఓ ‘రౌడీ’ని కూడా చూశాం. ఇప్పుడు తనలో మరో యాంగిల్ చూపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. తన అప్ కమింగ్ మూవీతో ఈ హీరో ఇప్పుడు సింగర్ గా మారాడు.

అవును.. ‘గీతగోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పాట పాడాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. అదే రేంజ్ లో విజయ్ దేవరకొండ పాడిన పాట కూడా ట్రెండింగ్ అవ్వడం ఖాయమని యూనిట్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయింది.

ఈ ఆదివారం గీతగోవిందం ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మరోవైపు టీజర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో ‘గీతగోవిందం’ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి.

‘గీతగోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ పాడిన సాంగ్ కూడా హిట్ అయితే, ఇకపై తన సినిమాల్లో విజయ్ దేవరకొండ రెగ్యులర్ గా పాటలు పాడతాడేమో.