‘అనగనగా’ ఫస్ట్ సింగిల్ – గూఢచారి

Tuesday,July 24,2018 - 04:32 by Z_CLU

అడివి శేష్ ‘గూఢచారి’ ఆగష్టు 3 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ఇప్పటికే ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసింది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

‘అనగనగా ఓ మెరుపుకల..’ అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో ఈ సాంగ్ ఎగ్జాక్ట్ గా ఏ సిచ్యువేషన్ లో వస్తుందో చెప్పడం కష్టం కానీ, ప్రస్తుతం యూ ట్యూబ్ లో నంబర్స్ పెంచుకునే పనిలో ఉన్న ఈ సింగిల్, ఈ సినిమా స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఈజీగా ఎలివేట్ చేస్తుంది. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ట్యూన్స్ కి అంబిక వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందనిపిస్తుంది.  రమేష్ యాద్మా ఈ పాటకి లిరిక్స్ రాశాడు.

స్టైలిష్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివి శేష్ RAW ఏజెంట్ లా కనిపించనున్నాడు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి డైరెక్టర్. శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు.