చిరంజీవి అవకాశం ఇస్తే తెలుగు సినిమా చేస్తా

Monday,July 25,2022 - 04:18 by Z_CLU

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కు ఇష్టమైన హీరో చిరంజీవి. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఆయన బయటపెట్టారు. తనకు చిరంజీవి స్ఫూర్తి అంటూ చాలా సందర్భాల్లో చెప్పారాయన. డాన్స్ అంటే ఏంటో, ఎలా చేయాలో చిరంజీవిని చూసి నేర్చుకోవాలని అన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, అవకాశం వస్తే చిరంజీవితో నటిస్తానంటున్నారు.

“ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది.అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.అందుకే తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగింది. చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. చిరంజీవి నాకు కూడా అవకాశం ఇస్తే నేను తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నాను”.

ఇలా చిరంజీవితో నటించాలనే కోరికను బయటపెట్టాడు అమీర్ ఖాన్. ఇతడు నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సీనిమాలో నాగచైతన్య ఓ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రచారం కోసం నాగచైతన్యతో పాటు చిరంజీవి, నాగార్జున కూడా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా చిరంజీవితో సినిమా చేయాలని ఉందనే కోరికను బయటపెట్టాడు అమీర్.