ధృవ రిలీజ్ డేట్ ఫిక్స్ ..

Monday,September 26,2016 - 05:54 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ‘ధృవ’. తమిళ చిత్రం ‘తనీఒరువన్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుంది.

ram-charan-dhruva-movie-stills-1

   ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు నిర్మాత అల్లు అరవింద్. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కానందున దసరా నుండి పోస్ట్ ఫోన్ చేసి డిసెంబర్ మొదటి వారం లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. తమిళ చిత్రం రీమేక్ అయినప్పటికీ సురేందర్ రెడ్డి ఈ సినిమాను తన దైన స్టైల్ లో రూపొందిస్తున్నాడని అంటున్నాయి చిత్ర వర్గాలు..