సౌత్ పై ఫోకస్..

Tuesday,September 27,2016 - 09:00 by Z_CLU

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న రాశి ఖన్నా కేవలం సినిమాల్లోనే కాకుండా పబ్లిక్ అప్పీరియన్స్ తో కూడా కిక్కెక్కిస్తోంది. తొలుత బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై అతి తక్కువ సమయం లోనే కథానాయికగా మంచి గుర్తింపు అందుకుంటూ కుర్ర హీరోల ను ఆకర్షిస్తూ ముందుకు సాగుతుంది. ఇటీవలే ‘సుప్రీమ్’
తో మంచి విజయం అందుకున్న ఈ భామ తాజాగా రామ్ సరసన మరో సారి ‘హైపర్’ తో ప్రేక్షకుల ముందుకురానుంది.

img_4253

    ప్రస్తుతం టాలీవుడ్ భామలందరూ టాలీవుడ్ నుండి బాలీవుడ్ పై దృష్టి పెడితే ఈ అమ్మడు మాత్రం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సౌత్ పైనే ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటున్న రాశి తాజాగా కోలీవుడ్ లో ఎంట్రీకి సిద్దమయింది. త్వరలోనే సిద్దార్థ్ సరసన ‘సైతాన్ కా బచ్చే’ అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న ఈ బొద్దుగుమ్మ ఇక పై టాలీవుడ్, కోలీవుడ్ లో దూసుకుపోవడానికి రెడీ అవుతుంది. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ లో ఓ విల్లా కూడా కొనుగోలు చేసిందట రాశి.