వెంకీకి మరో సినిమా దొరికినట్టే!

Friday,May 22,2020 - 03:31 by Z_CLU

వెంకటేష్ కెరీర్ లోనే విలక్షణ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది దృశ్యం. మలయాళంలో మోహన్ లాల్ నటించిన సినిమాకు రీమేక్ అది. మలయాళంలో ఎంత పెద్ద హిట్టయిందో, తెలుగులో కూడా ఆ సినిమా
అంతే హిట్ అయింది.

ఇప్పుడీ సినిమాకు రీమేక్ వస్తోంది. దృశ్యం సినిమాకు రీమేక్ తీయబోతున్నట్టు అటు దర్శకుడు జీతూ జోసెఫ్, ఇటు హీరో మోహన్ లాల్ ఇద్దరూ ప్రకటించారు. నిన్న మోహన్ లాల్ పుట్టినరోజు. ఆ సందర్భంగా సీక్వెల్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది.

అక్కడ సీక్వెల్ వస్తుందనగానే ఇక్కడ అంతా వెంకీ వైపు చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే దృశ్యం సీక్వెల్ ను తెలుగులో రీమేక్ చేయాలంటే ఆటోమేటిగ్గా అది వెంకీ వైపే వెళ్తుంది. హీరోయిన్ గా మీన మరోసారి నటించనుంది.

సినిమా నాలెడ్జ్ బాగా ఉన్న ఓ సాధారణ వ్యక్తి అసాధారణంగా ఆలోచించి, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనే కాన్సెప్ట్ తో దృశ్యం తెరకెక్కింది. యాజ్ ఇటీజ్ అదే కుటుంబం సీక్వెల్ లో కూడా
రిపీట్ అవుతుంది. కాకపోతే ఈసారి ఆ కుటుంబానికి ఓ కొత్త సమస్య వస్తుంది. అదే దృశ్యం-2.