ఓవర్సీస్ లో అల్లుడి హంగామా

Friday,September 14,2018 - 06:31 by Z_CLU

సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా. ఇటు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోను ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ ని రికార్డ్ చేసుకుంటుంది. ఓవర్సీస్ లో 170 లొకేషన్ లలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజే కోటి, పది లక్షలు వసూలు చేసింది.

ఒక్క U.S. ప్రీమియర్స్ లోనే $10,8290 వసూలు చేసిన ఈ సినిమా, నాగచైతన్య కరియర్ లోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక గురువారం $51677 వసూలు చేసిన ఈ సినిమా, ఈ వీకెండ్ మరిన్ని భారీ వసూళ్లు రికార్డ్ చేసుకోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

వినాయక చవితి సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఈ వీకెండ్ కి మరిన్ని కలెక్షన్స్ రికార్డ్ చేయనుంది. మారుతి, నాగచైతన్య కాంబినేషన్ అనగానే క్రియేట్ అయిన క్రేజ్ కి, ఇప్పుడు పాజిటివ్ మౌత్ టాక్ కూడా ఆడ్ అవ్వడంతో, మరో 2 రోజుల్లో సినిమా బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది.