చిరు-కొరటాల సినిమా లాంఛ్

Tuesday,October 08,2019 - 01:01 by Z_CLU

మెగాఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ప్రారంభమైంది. తన 152వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను, దసరా పర్వదినాన ప్రారంభించారు.

భరత్ అనే నేను సినిమా తర్వాత పూర్తిగా చిరంజీవి సినిమాపైనే ఫోకస్ పెట్టారు కొరటాల. అలా లాంగ్ గ్యాప్ తీసుకొని చిరంజీవి కోసం అద్భుతమైన కథ-స్క్రీన్ ప్లే రెడీ చేశారు. ఇప్పుడా సినిమా అఫీషియల్ గా లాంచ్ అయింది. చిరంజీవి భార్య సురేఖ, దేవుని పటాలపై క్లాప్ కొట్టి మూవీ మొదలుపెట్టారు.

ఎప్పట్లానే ఈ సినిమాను కూడా రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. అయితే ఈసారి తనతో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ను సహ-నిర్మాతగా చేర్చుకున్నాడు. ప్రస్తుతానికి సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ను మాత్రమే ఫిక్స్ చేశారు. డీవోపీగా తిరును, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ ను తీసుకున్నారు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరోయిన్ ను సెలక్ట్ చేశారు. కాకపోతే అది ఎవరనే విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.