‘బూమరాంగ్‌’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన హ‌రీశ్ శంక‌ర్‌

Thursday,January 02,2020 - 11:39 by Z_CLU

గద్దలకొండ గణేష్ ఫేం అధర్వ మురళి హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బూమరాంగ్‌’. ఈ చిత్రంలో మేఘా ఆకాష్‌, ఇందూజ రవిచంద్రన్‌ హీరోయిన్లు. ఆర్‌. కణ్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సతీష్‌కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ – “అధ‌ర్వ నాకు చాలా ఇష్ట‌మైన హీరో. హ్యండ్ స‌మ్ హీరోనే కాదు..ప్యాష‌నేట్ హీరో కూడా. త‌ను న‌టించిన బూమ్ రాంగ్ సినిమా ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌వుతుండ‌టం ఆనందంగా ఉంది. ట్రైల‌ర్ చూశాను. అద్భుతంగా ఉంది. సోష‌ల్ మెసేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్ మూవీ ఇది. యూత్ త‌లుచుకుంటే వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి మార్పు తేవ‌చ్చున‌నే విష‌యాన్ని ఈ సినిమా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అధ‌ర్వ చ‌క్క‌గా న‌టించాడు. త‌మిళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ సినిమా తెలుగులో మరింత పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌గారికి స్పెష‌ల్‌ థ్యాంక్స్‌. ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’ చిత్రాల్లో పాటలతో తెలుగు ప్రేక్షకులను వీనులవిందైన స్వరాలను అందించిన రధన్, ఈ చిత్రానికి హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. జ‌న‌వ‌రి 3న సినిమాను విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.