`హిట్‌` ఫ‌స్ట్ గ్లింప్స్‌.. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల

Thursday,January 02,2020 - 11:52 by Z_CLU

నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాతగా, వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న మూవీ హిట్. `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ ఇందులో హీరో. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. కంప్లీట్ థ్రిల్లర్ జానర్ లో సినిమా తెరకెక్కిందనే విషయం గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది.

`ది ఫ‌స్ట్ కేస్‌` అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు.

వివేక్ సాగ‌ర్ సంగీతం.. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల చేస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను
స‌మ‌ర్ప‌ణ‌: నాని
నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని
మ్యూజిక్‌: వివేక్‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)
స్టంట్స్‌: న‌భా
ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనిల్ భాను