ఆర్పీ నుంచి మరో ప్రయోగం

Thursday,January 02,2020 - 11:28 by Z_CLU

సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమై తరువాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్పీ పట్నాయక్‌. తన సంగీతంతో ఎన్నో సినిమాల సక్సెస్‌లో కీ రోల్‌ ప్లే చేసిన ఆర్పీ దర్శకుడిగా మాత్రం రెగ్యులర్‌ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడు.

తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఆర్పీ. “అలిషా” పేరుతో హారర్‌ థ్రిల్లర్‌గా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ISM ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ సోనాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రచన-దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం బాధ్యతలు కూడా ఆర్పీనే చూస్తున్నాడు.

అనుష్‌ గోరక్‌ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య సాల్వి, వేదాంత్ సలూజా, రిచా కల్రా, అక్షయ్ బక్చు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతోంది.