యంగ్ డైరెక్టర్ రెండు సినిమాలు

Friday,December 25,2020 - 02:00 by Z_CLU

ప్రస్తుతం దర్శకులందరు ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ బిజీగా ఉంటే యంగ్ డైరెక్టర్ అనిష్ కృష్ణ మాత్రం ఒకే టైంలో రెండు సినిమాలు డైరెక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘అలా ఎలా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అనిష్. ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా దిల్ రాజు బ్యానర్లో రెండో సినిమా అవకాశం అందుకున్నాడు.

లవర్ సినిమా తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అనిష్ ప్రస్తుతం రెండు సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాతో పాటు ‘గాలి సంపత్’ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం గాలి సంపత్ కి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసాడు అనిష్.

ఇక నాగశౌర్య సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తయింది. రెండో షెడ్యుల్ ఫిబ్రవరి నుండి మొదలు కానుంది.