దిల్ రాజు c/o సంక్రాంతి

Thursday,January 31,2019 - 03:46 by Z_CLU

ఈ సంక్రాంతికి ఎఫ్2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు దిల్ రాజు. అంతకంటే ముందు ‘శతమానంభవతితో’ మరో సంక్రాంతి హిట్ అందుకున్నాడు. ఇదే ఊపులో వచ్చే మరో రెండు సంక్రాంతులకు కూడా ఇప్పుడే సినిమాలు ప్రకటించాడు.

ఈసారి తమ్ముడు శిరీష్ తనయుడు ఆశిష్ ను సంక్రాంతి బరిలో నిలబెట్టబోతున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమాకు ‘పలుకే బంగారమాయె’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాతో సతీష్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఇక 2021 సంక్రాంతికి కూడా సినిమా ఎనౌన్స్ చేశాడు దిల్ రాజు. ఈ సంక్రాంతికి హిట్ అయిన ‘ఎఫ్2’ సినిమాకు సీక్వెల్ గా ‘ఎఫ్3’ని తీసుకొస్తామని ప్రకటించాడు. ఎఫ్3లో ముగ్గురు హీరోలు ఉంటారంటున్న దిల్ రాజు, స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు, దానికి తగ్గట్టు హీరోను ఎంపిక చేస్తామని అంటున్నాడు.

ఇలా ప్రతి సంక్రాంతికి ఓ సినిమా ప్లాన్ చేస్తూ.. టాలీవుడ్ లో సంక్రాంతి రాజు అనిపించుకుంటున్నాడు దిల్ రాజు.