స్పీడ్ అందుకున్న ఎమీ జాక్సన్ పెళ్ళి పనులు

Thursday,January 31,2019 - 06:41 by Z_CLU

రీసెంట్ గా జనవరి 1 న ఎంగేజ్ మెంట్ చేసుకుంది ఎమీ జాక్సన్. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంది. అయితే తన ఎంగేజ్ మెంట్ ని చాలా సింపుల్ గా అనౌన్స్ చేసేసిన ఎమీ జాక్సన్ పెళ్ళి ని మాత్రం చాలా  గ్రాండ్ గా చేసుకోనుంది.

పెళ్ళి కోసం వెన్యూ ని ఫిక్స్ చేసుకోవడానికి రీసెంట్ గా గ్రీస్ కి వెళ్ళిన ఎమీ జాక్సన్, గ్రీస్ లోని మైకోనోస్ ఐలాండ్ లో క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జార్జ్ పెనాయోటో ని పెళ్ళి చేసుకోనుంది. అయితే ఈ పెళ్ళి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతీది తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తుందట ఎమీ జాక్సన్. ఈ పెళ్ళి తర్వాత UK లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది ఎమీ జాక్సన్.

ప్రస్తుతానికి ఎమీ తన పెళ్ళి డేట్ లాంటివి అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు కానీ, మ్యాగ్జిమం 2020 ఫస్టాఫ్ లో ఈ పెళ్ళి జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది.