మరో మల్టీస్టారర్ ని అనౌన్స్ చేసిన దిల్ రాజు

Thursday,July 12,2018 - 01:16 by Z_CLU

మరో సక్సెస్ ఫుల్ కాంబో సెట్స్ పైకి రానుంది. రీసెంట్ గా సమ్మోహనం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ తెరకెక్కనుంది.

ఇంతకీ ఈ మల్టీస్టారర్ లో నటించబోయే స్టార్స్ ఎవరు..? వారి సరసన నటించబోయే హీరోయిన్స్ ఎవరు లాంటి విషయాలు ప్రస్తుతానికి రివీల్ చేయకపోయినా, సినిమా మాత్రం కన్ఫమ్ అని అఫీషియల్ గా ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్.

గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మహేష్ బాబు, వెంకటేష్ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ ని ఒకే సెట్స్ పైకి తీసుకు వచ్చిన దిల్ రాజు, ఈ సారి ఏ స్టార్స్ తో మల్టీస్టారర్ చేయబోతున్నాడోనన్న క్యూరియాసిటీ మూవీ లవర్స్ లో క్రియేట్ అవుతుంది.

 

కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు మోహన్ కృష్ణ  ఇంద్రగంటి, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్టార్ కాస్ట్ తో పాటు టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ రోజు సోషల్ మీడియాలో ఈ సినిమాని అనౌన్స్ చేసిన సినిమా యూనిట్, త్వరలో కంప్లీట్ డీటేల్స్ తో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు.