రేపే ధృవ ట్రయిలర్ రిలీజ్

Thursday,November 24,2016 - 09:36 by Z_CLU

రామ్ చరణ్ ధృవ టీజర్ యూట్యూబ్ లో ఎంత సంచలనం సృష్టించిందో చూశాం. ఇప్పుడు థియేట్రికల్ ట్రయిలర్ తో కూడా రఫ్ఫాడించడానికి రెడీ అవుతోంది ధృవ. సినిమా ప్రమోషన్స్ స్ట్రాటజీ మార్చుకున్న మెగా ఫ్యామిలీ సరైనోడు టైపులో ఆడియో ఫంక్షన్ లేకుండానే సాంగ్స్ ని రిలీజ్ చేశారు. సినిమాకి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందని అనౌన్స్ చేసిన యూనిట్… రేపు థియేట్రికల్ ట్రయిలర్ ని రిలీజ్ చేయనుంది.

టీజర్, సాంగ్స్ తరవాత రిలీజ్ కానున్న ఈ థియేట్రికల్ ట్రేలర్ పై కూడా అంచనాలు భారీగానే ఫిక్సయ్యాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ధృవ డిసెంబర్ 9 న థియేటర్లలోకి రానుంది. థియేట్రికల్ ట్రయిలర్ విడుదలైన తర్వాత.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది.