అఖిల్ కు తల్లిగా టబు

Thursday,November 24,2016 - 10:09 by Z_CLU

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న అఖిల్ రెండో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఆ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయింది. ఇప్పుడు ఆ మూవీ కోసం మరో కీలక పాత్రకు టబును సంప్రదించినట్టు తెలుస్తోంది. సినిమాలో అఖిల్ కు అమ్మగా టబు నటించనుందని సమాచారం. ఈ మేరకు దర్శకుడు విక్రమ్ కుమార్, టబు మధ్య చర్చలు జరిగాయట.

nagarjuna-tabu
గతంలో టబు, నాగార్జున హిట్ పెయిర్ అనిపించుకుంది. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా అయితే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ తర్వాత ఈ హిట్ పెయిర్ ‘ఆవిడా మా ఆవిడ’ సినిమాలోనూ మెరిసింది. అంతెందుకు అఖిల్ ‘సిసింద్రీ’ సినిమాలోనూ ఆటాడుకుందాం రా అంటూ స్పెషల్ సాంగ్ తో అలరించింది టబూ. అక్కినేని ఫ్యామిలీతో అంతగా అల్లుకుపోయిన టబూ, ఇప్పుడు అఖిల్ కి తల్లిగా నటించనుందనే వార్త వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.