సూర్య సింగం ఆడియో రిలీజ్

Thursday,November 24,2016 - 09:02 by Z_CLU

నిజాయితీనే తన ఊపిరిగా భావించే ఒక పోలీసాఫీసర్ వృత్తి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కున్నాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిందే సింగం-3. అఫ్ కోర్స్ గతంలో రిలీజైన సింగం సిరీస్ కూడా సేమ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందే, కాకపోతే సిరీస్ మారుతున్న కొద్దీ కొత్త స్టాండర్డ్స్ తో ముందుకు వస్తున్నాడు సూర్య. ఇందులో భాగంగా సరికొత్త హంగులతో ముస్తాబైంది సింగం-3. హరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సింగం-3 పాటలు డిసెంబర్ 5 న రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

singam-3
రీసెంట్ గా రిలీజైన టీజర్ సోషల్ మీడియాలో పెద్ద ప్రకంపనలే సృష్టించింది. సింగం 3 సూర్య కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. డిసెంబర్ 16 న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు.