టాప్ హీరోయిన్ 2016

Monday,December 26,2016 - 06:17 by Z_CLU

ఈ ఇయర్ మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తో హీరోయిన్ గా టాప్ చైర్ దక్కించుకుంది రకుల్ ప్రీత్ సింగ్.. గతేడాది ‘పండగ చేస్కో’,’కిక్ 2 ‘,’బ్రూస్ లీ’ వంటి సినిమాలతో ఎంటర్టైన్ చేసిన ఈ అమ్మడు… ఈ ఏడాది ‘నాన్నకు ప్రేమతో’,’సరైనోడు’,’ధృవ’ సినిమాలతో వరుసపెట్టి 3 బ్లాక్ బస్టర్ ను తన ఖాతా లో వేసుకుంది.

ఓ పక్క కాజల్, తమన్నా, శృతి హాసన్ గట్టీ పోటీ ఇచ్చినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఈ ఇయర్ టాప్ ఛెయిర్ అందుకుంది రకుల్. ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో అలాగే బెల్లంకొండ శ్రీనివాస్, నాగచైతన్య సినిమాలు చేస్తున్న ఈ భామ వచ్చే ఏడాది ఆ సినిమాలతో నాలుగు హిట్స్ అందుకోవాలని చూస్తుంది.