SIR మూడు రోజుల కలెక్షన్స్

Monday,February 20,2023 - 11:35 by Z_CLU

Dhanush’s ‘SIR’ Movie 3days Collections

దనుష్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ‘సార్’ SIR  ప్రేక్షకుల నుండి మంచి మార్కులు అందుకుంది. విద్యారంగం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సందేశాత్మక సినిమాకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు అందుకుంటుంది.  ఫిబ్రవరి 17న మహా శివరాత్రి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మూడు రోజులకి గానూ 15 కోట్ల గ్రాస్ దాటేసింది.

రెండ్రోజులకే 36 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాదించిన ఈ సినిమా వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘సార్’ కి బెస్ట్ ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి రోజు 4 కోట్ల గ్రాస్ తెచ్చుకుంది. ఆ వసూళ్లను కంటిన్యూ చేస్తూ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రెండో రోజు 5 . 35 కోట్లు , రెండో రోజు 5 .74 కోట్లు వచ్చాయి.

సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బేనర్స్ పై నాగ వంశీ , సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా డీసెంట్ వసూళ్లు రాబడుతుంది. అక్కడ తమిళ్ వర్షం కంటే తెలుగు వర్షం ఎక్కువ కలెక్షన్ తెచ్చిపెడుతుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics