మరోసారి వాయిదాపడిన దండుపాళ్యం-2

Saturday,July 15,2017 - 02:05 by Z_CLU

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన ‘దండుపాళ్య’ కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా 30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి 10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన ‘దండుపాళ్యం’ టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 14న కన్నడలో విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అదే తేదీకి తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్రయత్నించారు. కానీ తాజాగా ఈ చిత్రం తెలుగులో జూలై 21న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ – ”తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మించిన ‘దండుపాళ్యం-2’ జూలై 14న కన్నడలో విడుదలైంది. ఈ సీక్వెల్‌గా ఆడియన్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని ఏరియాల్లోనూ యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌ వస్తోంది. ‘దండుపాళ్యం2’ చిత్రాన్ని తెలుగులో జూలై 21న విడుదల చేస్తున్నాం. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది” అన్నారు.