ప్రీ-రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టిన పవన్ సినిమా

Saturday,July 15,2017 - 01:56 by Z_CLU

పవన్-త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. అయితేనేం బిజినెస్ కు అది అడ్డంకి కాలేదు. పవన్ కొత్త సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో పవన్ సినిమా 90 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.

పవన్-త్రివిక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. మొదట వీళ్లిద్దరూ జల్సా సినిమాతో కలిశారు. అది సూపర్ హిట్. తర్వాత అత్తారింటికి దారేది చేశారు. అది ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ముచ్చటగా మూడోసారి కలిసింది ఈ హిట్ జోడీ. అందుకే ఈ సినిమా కళ్లుచెదిరే రేంజ్ లో బిజినెస్ చేసింది.

పవన్ సినిమాలో కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ ఇప్పటికే ఒక పాట మినహా మిగతా పాటలన్నీ కంపోజ్ చేసి ఇచ్చాడు. త్వరలోనే సాంగ్స్ షూటింగ్ కోసం యూనిట్ ఫారిన్ వెళ్లబోతోంది.