బాలయ్య కొత్త సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్

Saturday,July 15,2017 - 02:47 by Z_CLU

పైసా వసూల్ ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇంతలోనే బాలయ్య 102వ సినిమా పనులు మొదలయ్యాయి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలయ్య అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొన్నటివరకు సంగీత దర్శకుడ్ని ఫైనలైజ్ చేయలేదు. తాజాగా చిరంతన్ భట్ ను ఎంపిక చేయడం, మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి.

బాలయ్య నటించిన ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు. ఆ వర్క్ నచ్చడంతో ఇప్పుడు 102వ సినిమాకు కూడా అతడ్నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేశాడు బాలయ్య. రాయలసీయ ఫ్యాక్షనిజం, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది.

ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే నయనతారను సెలక్ట్ చేశారు. ఆగస్ట్ 10 నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు రెడ్డిగారు, జయసింహ, రూలర్ లాంటి టైటిల్స్ పరిశీలిస్తున్నారు. సినిమా సెట్స్ పైకి వచ్చిన వెంటనే టైటిల్ ఎనౌన్స్ చేస్తారు.