రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన దఢక్

Sunday,July 29,2018 - 12:44 by Z_CLU

శ్రీదేవి కూతురు జాన్వి హీరోయిన్ గా పరిచయమైన సినిమా దఢక్. ఇషాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కొత్త హీరోహీరోయిన్లు నటించినప్పటికీ దఢక్ సినిమాకు తొలి వారం 50 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంతా కొత్త నటీనటులతో తీసిన సినిమాకు మొదటి వారం 50 కోట్ల షేర్ రావడం ఓ రికార్డు

మరాఠీలో హిట్ అయన సైరాట్ సినిమాకు రీమేక్ గా దఢక్ తెరకెక్కింది. అదొక కారణమైతే, శ్రీదేవి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనేది మరో కారణం. అందరూ చూసేసిన సినిమానే అయినప్పటికీ, ఈ రెండు రీజన్స్ కారణంగా మొదటి వారం దఢక్ సినిమాకు రికార్డు వసూళ్లు వచ్చాయి.

జీ స్టుడియోస్, ధర్మ ప్రొడక్షన్స్  బ్యానర్లపై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందించారు. మొదటి సినిమా అయినప్పటికీ జాన్వి నటనకు మంచి మార్కులు పడ్డాయి.