వెంకీ మామ.. ఇట్స్ ఏ హిలేరియస్ మూవీ

Sunday,July 29,2018 - 12:56 by Z_CLU

సాధారణంగా మల్టీస్టారర్ అనగానే దాన్నొక యాక్షన్ మూవీ అనుకుంటారు ఎవరైనా. కానీ మల్టీస్టారర్స్ తో కామెడీ ఎంటర్ టైనర్లు తీయొచ్చని నిరూపించబోతున్నాడు దర్శకుడు బాబి. అవును.. వెంకీ-చైతూ హీరోలుగా ఈ డైరక్ట్ చేయబోయే వెంకీ మామ ప్రాజెక్టు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

ముఖ్యంగా వెంకటేష్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. అలాగే చైతూ, వెంకీ కాంబోలో వచ్చే సీన్లు కూడా బాగా నవ్విస్తాయట. ఆగష్టు 8న నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ సినిమాలో చైతూ సరసన మరోసారి రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించనుంది.

వెంకీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా ఈమె రజనీకాంత్ సరసన కాలా సినిమాలో నటించింది. నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.