'మహేష్ 25' ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

Sunday,July 29,2018 - 12:15 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. 25 వ సినిమా కావడంతో ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకొని కొత్త లుక్ ట్రై చేసాడు మహేష్.. గెడ్డంతో ఉన్న మహేష్ స్టిల్స్ ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఇప్పుడు అఫీషియల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రిన్స్. ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 8 సాయంత్రం మహేష్ బాబుకి బర్త్ డే విషెస్ చెప్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ కాలేజి కుర్రాడిగా కనిపించనున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అశ్వనిదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.