'దేవ‌దాస్' ఆడియో రిలీజ్ డేట్

Monday,September 17,2018 - 06:41 by Z_CLU

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న  ‘దేవ‌దాస్’ సినిమా ఆడియో పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో జరగనున్న ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు మేకర్స్. ఈ ఆడియో వేడుకలో యూనిట్ తో కలిసి మరికొందరు సినీ ప్రముఖులు  హాజరు కానున్నారు.

మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని  మూడు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్ర‌త్యేకంగా వినాయ‌క‌చ‌వితి నాడు విడుద‌లైన ల‌క ల‌క లంకు మిక‌రా పాట‌ ప్రస్తుతం హంగామా చేస్తుంది.

శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ  మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌రేష్ వికే, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ ‘వ‌యాక‌మ్ 18’ ఈ సినిమా కోసం వైజ‌యంతి బ్యాన‌ర్ తో టై అప్ అయ్యింది. సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘దేవ‌దాస్’ విడుద‌ల కానుంది.