వారం రోజులు.. 40 కోట్లు.. దేవదాస్ హిట్

Friday,October 05,2018 - 01:02 by Z_CLU

నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ దేవదాస్ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకొని సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. ఈ 7 రోజుల్లో దేవదాస్ సినిమా 40 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. నాగ్, నాని బాక్సాఫీస్ స్టామినాకు పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది దేవదాస్.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్ సినిమాలో దేవా అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నాగ్, దాస్ అనే డాక్టర్ పాత్రలో నాని నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, కర్ణాటకలో కూడా సూపర్ హిట్ వసూళ్లు సాధిస్తోంది.