పూజా హెగ్డే డబ్బింగ్ కు ప్రేక్షకులు ఫిదా

Friday,October 05,2018 - 12:10 by Z_CLU

అరవింద సమేత ట్రయిలర్ ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ ట్రయిలర్ లో పూజా హెగ్డే వాయిస్ కూడా అంతే హిట్ అయింది. ఇది డబ్బింగ్ వాయిస్ కాదు. పూజా హెగ్డే సొంత గొంతు. అవును.. అరవింద సమేత చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది పూజా హెగ్డే. ట్రయిలర్ లో ఆ వాయిస్ తనదే. అందుకే ఆడియన్స్ అంతలా ఫిదా అయ్యారు.

‘పేరు చాలా.. అడ్రెస్, ఫోన్ నంబర్ కూడా కావాలా’
‘కొంచెం జరగరా.. నాకు స్పేస్ కావాలి’
‘అడుగు.. అలా క్యూట్ గా చూడకు’
ట్రయిలర్ లో పూజా హెగ్డే చెప్పిన డైలాగ్స్ లో కొన్ని మాత్రమే. ఇవే ఇప్పుడు బాగా క్లిక్ అయ్యాయి. పూజాకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేశాయి. తెలుగులో పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకున్న ఫస్ట్ మూవీ ఇది.

గతంలో సాక్ష్యం సినిమాకు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆమె ట్రై చేసింది. కానీ ఇతర సినిమాల వల్ల అది సాధ్యం కాలేదు. అరవింద సమేత విషయానికొచ్చేసరికి, త్రివిక్రమ్ పట్టుబట్టి మరీ పూజా హెగ్డేతో డబ్బింగ్ చెప్పించాడు. అదే ఇప్పుడు ప్లస్ అయింది.