అఖిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

Thursday,January 05,2017 - 03:14 by Z_CLU

అక్కినేని ఫ్యాన్స్ ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న అఖిల్ రెండో సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 14, సంక్రాంతి రోజున హైదరాబాాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో అఖిల్ రెండో సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. తాజాగా విక్రమ్ కుమార్ ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా పూర్తచేశాడు. సినిమా లాంఛింగ్ రోజున హీరోయిన్ ఎవరనే విషయాన్ని ప్రకటించబోతున్నారు.

విక్రమ్ కుమార్ సినిమాలు కొత్తగా ఉంటాయి. మనం, 24 అనే సినిమాలకు విక్రమ్ కుమారే దర్శకుడు. అందుకే ఎంతో మంది దర్శకుల పేర్లు పరిశీలించిన తర్వాత, మరోసారి విక్రమ్ కుమార్ కు అవకాశం ఇవ్వాలని కింగ్ నాగార్జున డిసైడ్ అయ్యాడు. పైగా అఖిల్ కోసం విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీలైన్ నాగ్ కు బాగా నచ్చింది. సో.. అఖిల్ రెండో సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.