హారర్ కామెడీతో మరో హంగామా

Thursday,January 05,2017 - 04:25 by Z_CLU

కాంచన సిరీస్ తో హారర్ కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు లారెన్స్. ఇప్పుడీ డైరక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ అలాంటిదే మరో ప్రయత్నం చేస్తున్నాడు. డైరక్టర్ పి.వాసు దర్శకత్వంలో ఓ హారర్ సస్పెన్స్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ పేరు శివలింగ. కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన సూపర్ హిట్ మూవీ శివలింగను అదే పేరుతో లారెన్స్ ఇప్పుడు తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నాడు.

shiva-2

లారెన్స్-రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా 30కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ ట్రాక్ ను రేపు విడుదల చేయబోతున్నారు. అలా దశలవారీగా శివలింగ పాటల్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు.