శరవేగంగా సిద్ధమౌతున్న విన్నర్

Thursday,January 05,2017 - 02:30 by Z_CLU

సాయిధరమ్ తేజ నటిస్తున్న కొత్త సినిమా విన్నర్. ఈ సినిమా టాకీపార్ట్ దాదాపు పూర్తయింది. ఈమధ్యే ఉక్రెయిన్ తో పాటు మరికొన్ని యూరోప్ దేశాల్లో ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లోకి ఎంటరైంది. ఇవాళ్టి నుంచి హీరో సాయిధరమ్ తేజ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేేని అధికారికంగా ప్రకటించాడు. ఓ స్టిల్ కూడా రిలీజ్ చేశాడు.

winner

ప్రస్తుతం విన్నర్ సినిమా షూటింగ్ హైదరాబాాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 2 పాటల షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ లో కనువిందు చేయబోతోంది. ఈ సాంగ్ షూటింగ్ ను ఇప్పటికే కంప్లీట్ చేశారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న విన్నర్ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.