దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్

Friday,January 10,2020 - 12:01 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్, మురుగదాస్ కాంబోలో వచ్చిన దర్బార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మెరిసింది. భారీ స్థాయిలో థియేటర్లు దక్కడం, ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఏపీ, నైజాంలో కలిసి మొదటి రోజు దర్బార్ సినిమాకు ఏకంగా 4 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నాయి. మొదటి రోజే (ప్రీమియర్స్ తో కలిపి) హాఫ్ మిలియన్ మార్క్ టచ్ చేసిన దర్బార్, ఈరోజు మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ కాబోతోంది. అటు తమిళనాట ఈ సినిమాకు ఫస్ట్ డే ఏకంగా 20 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడం గ్యారెంటీ. రేపట్నుంచి సరిలేరు నీకెవ్వరు, ఎల్లుండి (ఆదివారం) నుంచి అల వైకుంఠపురములో సినిమాల హంగామా మొదలవుతుంది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 2.03 కోట్లు
సీడెడ్ – రూ. 0.66 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.44 కోట్లు
ఈస్ట్ – రూ. 0.28 కోట్లు
వెస్ట్ – రూ. 0.18 కోట్లు
గుంటూరు – రూ. 0.40 కోట్లు
కృష్ణా – రూ. 0.24 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు